కరిమద్దెల ఉన్నత పాఠశాల నందు శక్తి టీం బృందాలచే అవగాహన కార్యాక్రమం

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 13 :

నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్నీ స్కూల్లలో మరియు కాలేజీలలో మహిళలపై నేరాలు , బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ పై నియంత్రణ, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎం.జావళి సూచనలతో నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది గడివేముల మండలం కరిమద్దెల గ్రామం నందు గల జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థినిలకు శక్తి యాప్ గురించి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలియజేయడంతో పాటు మీ తల్లిదండ్రులకు శక్తి యాప్ గురించి తెలియజేసి వారి సెల్ ఫోన్ లలో రిజిస్టేషన్ చేసుకునేలా చూడాలన్నాను. అనంతరం ప్రస్తుతం సమాజంలో జరిగే సైబర్ క్రైమ్ నేరాల గురించి వివరించి ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని అవగాహన కల్పించారు.బాల్య వివాహాలు, మహిళలు,చిన్నపిల్లలపై జరిగే నేరాలగురించి అవగాహన కల్పించి వాటికి సంబందించిన టోల్ ఫ్రీ నెంబర్ 1098 గురించి వివరించారు. ఆపద సమయంలో అమ్మాయిలు శక్తి యాప్ నంబర్ 7993485111 కు ఫోన్ చేసినచో తక్షణమే స్పందిస్తామని శక్తి టీం బృందాలి తెలిపారు. నంద్యాల జిల్లాలో గల వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను తెలిపి శక్తి టీముల పనితీరును వివరించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన 112/100 గురించి తెలిపారు. మీరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, విద్యతో పాటు మంచి నైతిక విలువలను అలవర్చుకోవాలన్నారు.బాలికలు అన్ని రంగాల్లో రాణించగల సామర్థ్యం కలవారని, ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధ్యాపకులకు తెలిపారు.

Scroll to Top