ఐబీపీఎస్, ఆర్ఆర్ బి ఆఫీసర్స్ బ్యాంక్ ఉద్యోగాలల్లో గురు రాఘవేంద్ర విద్యార్థుల ప్రభంజనం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 03:
నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీలోని శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు 2025 అకడమిక్ సంవత్సరానికి గాను రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్ బి) ఐబీపీఎస్ బ్యాంకుల నందు 70 ఆఫీసర్స్ ఉద్యోగాలను సాధించినట్లుగా గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ డా.పి దస్తగిరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ఆవరణలో ఉద్యోగాలను సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి. మౌలాలి రెడ్డి  మాట్లాడుతూ మాకున్న ఒకే బ్రాంచ్ లో దేశంలోనే అధికంగా ఆఫీసర్స్ మరియు క్లరికల్ ఉద్యోగాలను మా విద్యార్థులు సాధించారని తెలిపారు. 1989వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరం వరకు మా కోచింగ్ సెంటర్ నుండి 44,000 వేల మంది విద్యార్థులు బ్యాంకు ఉద్యోగాలను సాధించారు. నేటితరం విద్యార్థులకు ఆధునిక టెక్నాలజితో కూడిన విద్యావిధానాలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాము అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. అని తెలుపుతూ విద్యార్థుల విజయాలను ప్రశంసించారు. 2026 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో వేలాదిగా ఆఫీసర్స్ మరియు క్లరికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుచున్నవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ, యువకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనతి కాలంలో బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నాము. సమాజానికి తమ వంతుగా కృషి చేయాలనే సదుద్దేశంతో నిరుద్యోగ యువతీ యువకులకు అతి తక్కువ ఫీజులతోనే ఉద్యోగం వచ్చేంతవరకు శిక్షణ అందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మరియు టీచింగ్ ,నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

Scroll to Top