ఎగ్జిబిషన్ శ్రీనుకు ఘన సత్కారం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 16 :
నంద్యాల పట్టణ ప్రధాననంది సమీపంలో రెండు నెలల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగించిన నిర్వాహకుడు “శ్రీను”ను సోమవారం ఘనంగా సత్కరించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, టిడిపి సీనియర్ నాయకుడు జిల్లెల్ల శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. బాల రాముని ప్రతిమ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించిన నిర్వాహకుడు శ్రీనును అభినందించారు. సన్మాన గ్రహీత శ్రీను మాట్లాడుతూ అయోధ్య రాముడిని దర్శించిన అనుభూతిని ప్రజలకు కలిగించాలనే ఉద్దేశంతో ఆలయ నమూనా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నంద్యాల ప్రజల ఆదరణ తనకు ప్రోత్సాహంగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Scroll to Top