

ఈ ఏడదైనా జనవరి1న జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తాం
AIYF రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన బిక్షాటన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన – ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు.
బిక్షాటన కార్యక్రమం అనంతరం DRO రాముడు నాయక్ కి వినతిపత్రం అందజేసిన AIYF నంద్యాల జిల్లా నేతలు
*ఈ సందర్భంగా AIYF నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ యువతకు 3,000/_ నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం చెందారని ఈ జనవరి ఒకటికైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై పడుతున్నారని మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై ఆ మత్తులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ హత్యలన్నీ ప్రభుత్వ వైఫల్య హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు.కార్పొరేషన్ లోన్లు తక్షణమే విడుదల చేయాలని తద్వారా ఉపాధిని కల్పించుకోవడం కోసం ఉపయోగపడుతుందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని దేశం ముందుకు పోవాలంటే అది యువతతోనే సాధ్యమని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా జీవితాలను నాశనం చేస్తున్నారని,యువతరం ఆగ్రహం చెందుతే మీ ప్రభుత్వాలు కూలిపోతాయ బంగ్లాదేశ్, ఇతర దేశాలను గుర్తు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో AISF జిల్లా అధ్యక్షులు ఎర్రిస్వామి,AIYF నాయకులు మధు, శ్రీకాంత్, పామూలేటి,బన్నీ,శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
