ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు ఫయాజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 10 :

నంద్యాల నంద్యాల మండల పరిధిలో కానాల గ్రామంలో నంద్యాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జి. హరిబాబు, కమిటీ డైరెక్టర్లు పిట్టల మదార్ సా, నూర్ బాషా, జనసేన నాయకులు, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరి పీడీ బాబు, తెలుగు దేశం నంద్యాల మండలం జనరల్ సెక్రటరీ పిట్టల హనీఫ్, బాలమద్దిలేటి, హుస్సేన్, గ్రామ నాయకులు, పశు సంవర్ధ శాఖ అధికారి, రైతులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఎన్ ఎండి ఫయాజ్ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మార్కెట్ యార్డ్ పరిధిలో కావాల్సిన సేవా కార్యక్రమాలను మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు కావాల్సిన అన్ని సేవలను, ప్రయోజనాలను కల్పిస్తామని, అలాగే లింకు రోడ్లను కూడా వేయవచ్చని తెలిపారు. మంత్రి ఫరూక్ సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Scroll to Top