ఈద్ కిట్స్ పంపిణీ చేసిన చాంద్ బడా ఎస్‌డిపిఐ నాయకులు మరియు జోయా హెల్పింగ్ హాండ్స్ సభ్యులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 18 :
జోయా హెల్పింగ్ హాండ్స్ సభ్యురాలు పూల జరీన గారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మనతో పాటు నిరుపేదలు కూడా ఆనందంగా ఈద్ పండుగను జరుపుకోవాలని ఉద్దేశంతో ఈద్ కిట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పేద మరియు అవసరమైన కుటుంబాలకు పండుగ జరుపుకోవడానికి అవసరమైన 9 రకాల సరుకులతో కూడిన ఈద్ కిట్‌లను అందజేశామని తెలియజేశారు.
ఎస్‌డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు కరిముల్లా మాట్లాడుతూ రంజాన్ నెల అనేది దానం, దయ, సేవలతో కూడుకున్న పవిత్రమైన సమయం అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవడం మన బాధ్యత అని తెలిపారు. “మన ఆనందం పంచుకుంటేనే పండుగకు నిజమైన అర్ధం ఉంటుంది” అని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 60 పైగా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోయా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఇస్మాయిల్, ఇశ్రాత్, ఫారుక్, ఎస్‌డిపిఐ పార్టీ చాంద్ బడా బ్రాంచ్ అధ్యక్షుడు సుహేల్ పాల్గొన్నారు.

Scroll to Top