ఆహోబిలంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

  • 284 మద్యం సీసాలు స్వాధీనం, 8 మందిపై చర్యలు
  • చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం….
  •  ఆళ్లగడ్డ డీఎస్పీ కె. ప్రమోద్

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 21 :

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్  ఆదేశాలమేరకు,నేటి తెల్లవారుజామున అహోబిలంలో ఆళ్లగడ్డ డిఎస్పి కె. ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని సుమారు 50 మంది సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 284 మద్యం  బాటిల్లను 8 మంది వ్యక్తుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. వాటిలో: 247 విస్కీ బాటిల్లు, 37 బీరు సీసాలు, అదనంగా ముఖ్య ప్రదేశాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు మరియు అనుమానితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డీఎస్పీ మాట్లాడుతూ ఆహోబిలం ఒక ప్రతిష్ఠాత్మక పుణ్యక్షేత్రం అని, ఇక్కడ అక్రమ మద్యం విక్రయాలు, నాటు సారా, రౌడీయిజం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించబోమని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సీఐ ఆళ్లగడ్డ రూరల్ బి.వి. రమణ, ఎస్ఐ ఆళ్లగడ్డ రూరల్ వరప్రసాద్, ఎస్ఐ ఉయ్యాలవాడ రామిరెడ్డి, ఎస్ఐ చాగలమరి రాజారెడ్డి, ఎస్ఐ ఆళ్లగడ్డ టౌన్ పీరయ్య, ఎస్ఐ రుద్రవరం జయప్ప పాల్గొన్నారు.

Scroll to Top