

అతి త్వరలో ఆరోగ్య తులసి పథకం..ఆరోగ్య భీమా.. ఆరోగ్య థీమా.. ప్రారంభం..
నంద్యాల నియోజకవర్గ ప్రైవేటు ఉద్యోగస్తులకు అద్భుతమైన ప్రకటన..
నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గోళ్ళ రాజేష్ ప్రవేశపెట్టనున్న “ఆరోగ్య తులసి పథకం..” ప్రారంభం చేయనున్నారు.
ఈ “ఆరోగ్య తులసి” పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉచితంగా అందించనున్నారు..
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / జనవరి 31 :
ఎంత నిరుపేద అయిన,ఎంత అత్యంత అధిక ధనవంతుడైన ఎవరికైనా ఆరోగ్యమే- మహాభాగ్యం ఆరోగ్యమే శ్రీరామరక్ష అలాంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కొన్ని కొన్ని సార్లు కాపాడుకోవడంలో కూడా అంత ఇబ్బంది ఎదురౌతుంది. సాధారణంగా ప్రైవేటు ఉద్యోగస్తులు కొన్ని సందర్భాలలో తమకు వచ్చే జీతాలలోని చాలి చాలని పరిస్థితులలో కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు ఎవరికైనా అకస్మాత్తుగా ఆరోగ్యకరంగా ఇబ్బందులు అనారోగ్యం ఎదురైనప్పుడు ఊహించని విధంగా హాస్పిటల్ ఖర్చులు పెరిగినప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఎందరో, ఎన్నోసార్లు చూశారు. మరి అలాంటి పరిస్థితులు వారికి కలగకూడదని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భీమా ఆరోగ్య భీమా ఉండాలని మన నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ అనేక రకాలుగా సహాయ సహకారాలు ఆర్థిక సహకారాలు అందిస్తూ ప్రజలందరికీ ఒక ఆత్మబంధువుగా ఎన్నో కార్యక్రమాలు వృత్తిరిత్య నంద్యాలలో అందుబాటులో లేనప్పటికీ కూడా వేరెక్కడో ఉండి తమ వ్యాపారిత్య బిజీగా ఉన్నప్పటికీ నంద్యాల వాసి అయినందున నంద్యాల నియోజకవర్గ ప్రజలపై,నంద్యాలపైన చెరగని ప్రేమ, అభిమానాలు వల్ల నంద్యాల నియోజకవర్గ ప్రజలను తన వంతు సాయంగా ఎన్నో రకాల సహాయ,సహకారాలు అందించాలని మంచి సత్సంకల్పంతో దయార్థ హృదయంతో ముందుకు వెళుతున్నారు లక్షలాది రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు.
నేడు ప్రైవేట్ ఉద్యోగస్తుల జీతాలు వారి సమస్యలు దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్య స్థితిగతులను ఆలోచనచేసి ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ
ఆరోగ్య తులసి.. పథకం ద్వారా ఆరోగ్య భీమా.., ఆరోగ్య థీమా.. కలగాలని వారికి ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డు.. ఉచితంగా అర్హులైన ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ త్వరలో అందించనున్నారు. ఈ హెల్త్ కార్డు ఐదు లక్షల వరకు ఆపరేషన్లు, సర్జరీలు చేయించుకునేందుకు హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది.హెల్త్ కార్డు కలిగిన సభ్యులకు ఐదు లక్షల రూపాయలు సంబంధిత యాజమాన్యమే భరిస్తుంది
అరుగ్య తులసి పథకం..అర్హతలు :
1.ప్రైవేటు ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్న యాజమాన్యం ప్రభుత్వానికి జి.ఎస్టి కలిగిన సంస్థ అయిన ఉండాలి
2. ప్రైవేటు ఉద్యోగస్తులు నంద్యాల నియోజకవర్గ వాసులై ఉండాలి
3. వాళ్లు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ ఐడి కార్డు కలిగి ఉండాలి..”లేదా” ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి తమ యాజమాన్యం సిఫార్సు చేసే పత్రం కలిగి ఉండాలి..
#తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తించదు..
#ఆధార్ కార్డు జిరాక్స్..
#సంస్థ గుర్తింపు కార్డు..
#రెండు ఫోటోలు..
