కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్
కొనసాగుతున్న 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 12:
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి.
• ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అభివృద్ధి జరిగితే… ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వస్తుంది.
• ప్రతీ రంగంలోనూ వృద్ధి సాధించటం ద్వారా జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోవాలి.
• కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నారు… పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారు.
• టెండర్లు, వర్క్ ఆర్డర్లలోని కాంట్రాక్టర్ల నుంచి ఆదాయం రావటం లేదు.
• జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు చెల్లించే పన్నులు మన రాష్ట్రంలో చెల్లించేలా చూడాలి.
• పన్ను వసూళ్ల విషయంలో అనవసరపు వేధింపులు వద్దు.
• పన్ను ఎగవేతలు లేకుండా ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదు… పన్నులు చెల్లించేలా చూడాలి.
• ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి పన్ను ఎగవేతకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి.
