
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 02 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆశయాలకు న్యాయం చేయడమే కాకుండా, అభివృద్ధి దిశగా కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా నంద్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసినది. అలాగే అర్బన్. రూరల్ కార్యాలయాలలో ముందు ముగ్గులు వేసి సిబ్బంది ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు,. రూరల్ తాసిల్దార్. శ్రీవాణి. డిప్యూటీ తహసీల్దార్లు. రామ చంద్ర రావు. రామసంజీవరావు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ రెడ్డి,ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ శేఖర్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సర్వేయర్ సహదేవుడు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
