అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడ రెజ్లింగ్

రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిస్తె స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం సాధించాలి

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 02 :

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడ రెజ్లింగ్,రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిస్తె స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నంద్యాల జిల్లా స్థాయి రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యదేవర సుధాకర్ పేర్కొన్నారు.

నంద్యాల క్రాంతి నగర్ శ్రీ శాంతినికేతన్ సి. బి. ఎస్. ఈ. విద్యా సంస్థలకు చెందిన క్రీడా మైదానం లో జిల్లాస్థాయి U-15,U-17,U-20 రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నంద్యాల జిల్లాస్థాయి రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యదేవర సుధాకర్ , జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ రాబర్ట్ పాల్గొన్నారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యదేవర సుధాకర్ మాట్లాడుతూ రెజ్లింగ్ పోటీలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవని, వీటిలో నైపుణ్యం కనబరిచి విజేతలైన విద్యార్థులకు స్పోర్ట్స్ కోటానందు అటు విద్యలోనూ ,ఇటు ఉద్యోగ రంగంలోనూ భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. కాబట్టి ఈ పోటీలలో పాల్గొనేటువంటి విద్యార్థులు చక్కగా రాణించి అటు నంద్యాల జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కు , నంద్యాల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో విజేతలు అయిన విద్యార్థులు ఈనెల 6,7,8 తేదీలలో చిత్తూరు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు.

Scroll to Top