ముఖ్య అతిథిగా శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగినీ రవి సింగారెడ్డి




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 08 :
నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిల్పా మహిళా సహకార సంఘం చైర్మన్ నాగినీ రవి సింగారెడ్డి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా నాగినీ రవి సింగారెడ్డి మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడి వారిని స్వయం సమృద్ధిగా నిలబెట్టడం సమాజం మొత్తం బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోషకాహార కిట్స్‌ను అందజేశారు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తు బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా గడిపి వారితో మమేకమయ్యారు. చిన్నారులతో మాట్లాడుతూ వారిలో ఆనందాన్ని నింపుతూ, వారికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు అక్కడి వారందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, దాల్ మిల్ అమీర్, డాక్టర్ మొహమ్మద్ రఫీ, డాక్టర్ జాస్మిన్ సుల్తానా, డాక్టర్ వైష్ణవి మరియు స్థానిక మహిళలు, సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
