రెవెన్యూ అంశాలపై రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్రీ సర్వే సమస్యల పరిష్కారంతో ప్రజలకు మెరుగైన సేవలు – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 6 :
రీ –సర్వే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శక సేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రెవెన్యూ క్లినిక్స్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం – పీజీఆర్ఎస్), రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, మ్యుటేషన్లు, ల్యాండ్ క్లాసిఫికేషన్, జీరో నంబర్ ఖాతాలు, జీరో ఎక్స్టెంట్ ఖాతాలు, జాయింట్ ఎల్పిఎంలు, రీ సర్వే, వెబ్ల్యాండ్ పోర్టింగ్, వాటర్ ట్యాక్స్ తదితర కీలక రెవెన్యూ అంశాలపై జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీసీఎల్ఏ & స్పెషల్ సీఎస్ జయలక్ష్మితో కలిసి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) సాయిప్రసాద్ అధ్యక్షత వహించారు.
నంద్యాల జిల్లా నుంచి కలెక్టరేట్‌లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తదితర అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రీ సర్వేకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించి, ప్రజలకు మరింత సానుకూల దృక్పథంతో వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రెవెన్యూ సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Scroll to Top