
పదో తారీకు నిజాలు బయటపడతాయి
డైరీ వద్ద డిబేట్‌కు సవాల్ – భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి /జనవరి 5 :
విజయ పాల డైరీ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ..డైరీ త్రి సభ్య కమిటీ ముందు ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులు హాజరుకావాలని ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఈ రోజు సమావేశం జరగాల్సి ఉండగా,కమిటీ మరోసారి పదో తారీకు వరకు వాయిదా వేయడంతో వివాదం మరింత ముదిరింది..
ఈ సందర్భంగా డైరీ వద్దకు చేరుకున్న ఆళ్లగడ్డ టీడీపీ యువ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తీవ్ర స్థాయిలో పాలకవర్గం పై ప్రశ్నలు సంధించారు..ఇది నేను డైరీకి రావడం రెండోసారి.
ఈ రోజు కూడా వాయిదా వేశారు. పదో తారీకు మళ్లీ ఏం డ్రామా చేస్తారో తెలియదు.
కానీ కచ్చితంగా నేను వస్తా” అని స్పష్టం చేశారు.
వాళ్లు సమాధానం చెప్పడానికి,వినడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా వస్తానని భూమా విఖ్యాత్ రెడ్డి తెలిపారు..
“వాళ్లు అడిగిన ప్రశ్నలకే కాదు,నాకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి..! ..సంవత్సరం పాటు పాలు పోయని వారు ఎలా డైరెక్టర్లు అయ్యారు.??
డైరెక్టర్లే కాకుండా ఎలా చైర్మన్లుగా కూర్చున్నారు??” అంటూ నిలదీశారు.
ఇటీవల కొందరు ప్రెస్ మీట్లు పెట్టి రూల్స్ గురించి మాట్లాడుతున్నారని,అయితే నిజంగా ఇక్కడ పరిపాలన రూల్స్ ప్రకారం జరుగుతుందో??లేదో?? ఒక్కరూ చెప్పడం లేదని ప్రశ్నించారు.!
“ఒక సొసైటీని రద్దు చేసే అధికారం ఈ బోర్డుకు లేదు..
ఆ అధికారం కేవలం జనరల్ బాడీకి మాత్రమే ఉంటుంది కానీ దాదాపు రెండు సంవత్సరాలుగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు.. మీటింగ్ పెట్టకుండా ఇళ్లకు వెళ్లి సంతకాలు తీసుకుంటున్నారు” అని ఆరోపించారు.
ఏనాడు పాలు పోయ్యని డైరెక్టర్లు ఈ రోజు డైరెక్టర్లు,చైర్మన్లుగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించిన భూమా విఖ్యాత్ రెడ్డి, ఒకే ఏడాదిలో ఐదుగురు కో-ఆప్షన్ మెంబర్లుగా ఎలా నియమితులయ్యారని నిలదీశారు..!
“ఇవన్నీ ఏ రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి..??” అని ప్రశ్నించారు.
ఈ అంశాలపై అలాగే త్రి సభ్య కమిటీ సభ్యులు తన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“వాళ్లు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే, నేను కూడా ముత్యాలపాడు సొసైటీ నుంచి ఎలా చైర్మన్‌గా అయ్యానో పూర్తి వివరాలు వెల్లడిస్తా” అని అన్నారు..
డిబేట్‌కు తాను పూర్తిగా సిద్ధమని,అందుకే డైరీకి వస్తున్నానని తెలిపారు..
“నేను ఎక్కడా దాక్కోలేదు,ఇంట్లో కూర్చోలేదు..
వీళ్లు చేసే అక్రమాలను తప్పకుండా ప్రశ్నిస్తా..?? పోరాడతా..??
విజయ డైరీ నా చేతికి వచ్చినా..రాకపోయినా.. నా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది” అని భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేశారు..
డైరీ త్రి సభ్య కమిటీ ముందు ఈ రోజు హాజరు కావాల్సిన ముత్యాలపాడు సొసైటీ పాలకవర్గ సభ్యులు హాజరు కాకపోవడం, మరోసారి సమావేశం వాయిదా పడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..
పదో తారీకు జరిగే సమావేశంలో ఏం జరుగుతుందన్నదాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..
