విద్యార్థినిలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాల అధిరోహించాలి  –  నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

 నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని  బాలికల ఉన్నత పాఠశాల,  కళాశాలల్లో ఎ ఐ ఎఫ్ డి ఎస్, ఎ వి ఎస్ విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు,  రాష్ట్ర కార్యదర్శి డక్క కుమార్ ఆధ్వర్యంలో  ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శనివారం జరిగాయి.  ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్  బైరెడ్డి శబరి  సావిత్రిబాయి పూలే చిత్రానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉపాధ్యాయురాలుగా బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు అక్షరాభ్యాసం అందించి మహిళలు చదువులో కూడా ఉన్నత స్థానాల్లో ఉండొచ్చని ప్రతి మహిళలో ధైర్యం నింపి ఆదర్శంగా సావిత్రిబాయి పూలే నిలిచారన్నారు.  ప్రతి ఒక్క విద్యార్థిని సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి మీయొక్క గమ్యాలను చేరాలని పిలుపు నిచ్చారు. బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్థినిలకు, ఉపాధ్యాయులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు తెలియజేయాలని ఎంపీ శబరి  తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి  డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఆధ్వర్యంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి,  పాఠశాల విద్యార్థినుల చేత బైరెడ్డి శబరి పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో , నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ లాలు, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్,  ఉపాధ్యాయురాలు,  టిడిపి నాయకులు, బెస్త అశోక్ కుమార్ ( AIFDS నియోజకవర్గ కార్యదర్శి ),  NDK పాలెం బైరెడ్డి యూత్ మేఘనాథ్ , స్వామినాథం , సంతోష్ పాల్గొన్నారు.

Scroll to Top