
భారత పార్లమెంట్ కు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంనుంచి ఎన్నికైన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా, పి వి నరసింహరావు ప్రధాన మంత్రిగా, పెండెకంటి వెంకటసుబ్బయ్య గవర్నర్ గా, ఇలా అనేక మంది ప్రముఖ ఎంపీలు నంద్యాల కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ప్రముఖులు చూపిన ఆదర్శ బాటలో పయనిస్తూ, నంద్యాల పార్లమెంట్ కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికీ తీసుకెళ్లి, అనునిత్యం ప్రజల సేవే పరమావదిగా పనిచేస్తూ, నంద్యాల పార్లమెంట్ ప్రజల సమస్యలు, ఆంధ్ర ప్రదేశ్, భారత ప్రజల సమస్యలు కూడా భారత పార్లమెంట్ లో గళమెత్తిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో అటెండెన్స్ 88 శాతం, డిబేట్స్ 13, ప్రశ్నలు 123, ముఖ్యమైన చర్చలు రైల్వే కూలీలకు సామాజిక భద్రత, బోయ వాల్మీకులను ఎస్. టీ. జాబితాలో చేర్చండని, వైసీపీ నాయకులు టీడీపీ మహిళా ప్రజా ప్రతినిధులపై చేసిన ఆరోపణలపై, పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం పార్లమెంట్ లో తన వాణి వినిపించారు. పార్లమెంట్ లో ముఖ్యమైన ప్రశ్నలు, ఎన్ ఎల్ ఈ ఎం మందుల లభ్యత, మాజీ సైనికుల సంక్షేమం, పి ఎం కె ఎస్ వై క్రింద నీటి ప్రాజెక్టుల పునరుద్దరణ, మేరీ సక్ మొబైల్ ఇలా అనేక సమస్యలు భారత పార్లమెంట్ దృష్టికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తీసుకెళ్లడంవల్ల 2025 పోగ్రేస్ రిపోర్టు ఇలా ఉంది.
