


నంద్యాల జిల్లా / జనవరి 03- 2026 / సత్యం వార్త ప్రతినిధి :
సావిత్రి బాయి పూలే విగ్రహాన్ని నంద్యాల ప్రధాన కూడలిలో ఏర్పాటు చెయ్యాలని వారి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, MVRPS రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ పృద్విరాజ్ యాదవ్ లు.
నంద్యాల జిల్లా,నంద్యాల MRO ఆఫీస్ ,జిల్లా ఎస్పీ ఆఫీస్,కలెక్టర్ ఆఫీస్ లలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు జాతీయ బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్, MVRPS రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న లు ,పృద్విరాజ్ యాదవ్ బీసీ సంక్షేమ సంగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే 1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా, నైగావ్ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్ల చిన్న వయసులోనే ఆమెకు జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. అప్పట్లో ఆమెకు అక్షర జ్ఞానం లేదు, కానీ తన భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే చదువు నేర్చుకున్నారు. అహ్మద్ నగర్ మరియు పూణేలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు.
1848, జనవరి 1న పూణేలోని ‘భీడే వాడా’లో జ్యోతిరావు ఫూలేతో కలిసి సావిత్రిబాయి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు.
1897లో పూణేలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు, ఆమె స్వయంగా రోగులకు సేవలందించారు. వ్యాధి సోకిన ఒక బాలుడిని భుజాన మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చిన క్రమంలో, ఆమెకు కూడా ఆ వ్యాధి సోకి మార్చి 10, 1897న మరణించారు.
నేడు భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే, దానికి పునాది వేసిన వారు సావిత్రిబాయి ఫూలే. ఆమె జయంతిని పురస్కరించుకుని మనం పొందుతున్న విద్యా ఫలాలను స్మరించుకోవడం మన బాధ్యత అనే వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఆయుబు దస్తగిరిబాబు బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్,మధుమురలి యువజన విభాగం ఉపాధ్యక్షులు, ఎంవీఆర్పీఎస్ నాయకులు మధు,హరనాథ్ లక్ష్మి,తదితరులు పాల్గొని జయప్రదం చేశారు
