ప్రతి విద్యార్థిని ఫోన్‌లో ‘శక్తి’ యాప్ ఉండాలి…

– ఆపద సమయాల్లో తక్షణమే స్పందిస్తాం: శక్తి టీమ్ పోలీసుల భరోసా..

– నెరవాడ గురుకుల పాఠశాలలో సైబర్ క్రైమ్, చట్టాలపై అవగాహన…

​ నంద్యాల జిల్లా / జనవరి 02- 2026 / సత్యం వార్త ప్రతినిధి :

నంద్యాల ఏఎస్పీ (ASP) ఆదేశాల మేరకు, పాణ్యం మండలం నెరవాడ గ్రామంలోని ఏపీటీడబ్ల్యూఆర్ (APTWR) పాఠశాలలో నంద్యాల సబ్ డివిజన్ ‘శక్తి టీమ్’ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి శక్తి టీమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పోలీస్ మౌనిక హాజరై విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ‘శక్తి యాప్’ (నంబర్: 7993485111)ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్న ఏ అమ్మాయి లేదా మహిళ అయినా శక్తి యాప్ నంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించి రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు.

​అలాగే విద్యార్థులకు ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు:

​సైబర్ క్రైమ్: 1930

​చైల్డ్ వెల్ఫేర్: 1098

​ఉమెన్ వెల్ఫేర్: 181

​ఎమర్జెన్సీ కాల్: 112

​సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటిపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వన్ స్టాప్ సెంటర్ ఆవశ్యకతను వివరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల చేత శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేయించి, దాని పనితీరును ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సలామీ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Scroll to Top