నంద్యాల జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి – ప్రమాదకర బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు మరియు మెరుగుదల పనులు ముమ్మరం

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మే 02  :

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరియు ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 ప్రమాదకర బ్లాక్ స్పాట్‌లను గుర్తించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్  నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

పర్యటన మరియు పరిశీలన వివరాలు:

మొదటి రోజు : జాతీయ రహదారి (NH 44) పరిధిలో ఉన్న 9 బ్లాక్ స్పాట్‌లను జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ స్వయంగా సందర్శించి పరిశీలించడంతో పాటు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రత్యక ప్రణాళికలను రూపొందించి అమలుచెయ్యాలని సంబందిత అదికారులను ఆదేశించడం జరిగింది.

రెండవ రోజు: 02-05-2026 న జిల్లా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాలతో నంద్యాల పట్టణంలోని 6 ముఖ్యమైన ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్‌లను సంబంధిత అధికారులు తనిఖీ చేశారు.

నిర్ణయించిన ప్రధాన మెరుగుదల చర్యలు:

ప్రమాదాలను తగ్గించేందుకు రానున్న రోజుల్లో ఈ క్రింది పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు.

నంద్యాల చెరువుకట్ట సమీపంలో ఉన్న బ్లాక్ స్పాట్‌ వద్ద రోడ్డును వెడల్పు చేయడంతో పాటు, మలుపులను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు.

వచ్చే 30 రోజుల్లోగా స్పీడ్ బ్రేకర్లు, సరైన సైన్ బోర్డులు, కాజన్ బోర్డులు మరియు రోడ్డు సేఫ్టీకి అవసరమైన ఇతర సూచికలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదకర మలుపులు మరియు జంక్షన్ల వద్ద తగినంత వెలుతురు లేకపోవడాన్ని గుర్తించి, అక్కడ కొత్తగా ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

రోడ్డు గ్రేడియంట్ సరిగా లేని జంక్షన్ల వద్ద లోపాలను సరిదిద్దడం ద్వారా రాకపోకలను సులభతరం చేయనున్నారు.

తదుపరి కార్యాచరణ :

మిగిలిన 5 బ్లాక్ స్పాట్‌లను కూడా త్వరలోనే క్షుణ్ణంగా పరిశీలించి, రెండు రోజుల్లోగా సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికను సంబంధిత విభాగాలకు సమర్పించి, తక్షణమే పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నంద్యాల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బి. మల్లికార్జున గుప్తా, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్,

 ఎ. చాన్ బాషా, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ PS, ఈశ్వరయ్య, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నంద్యాల తాలూకా UPS,ఎ.వి.  శ్రీధరరెడ్డి, ఈఈ, ఆర్ అండ్ బీ, నంద్యాల,శేషన్న, మున్సిపల్ కమిషనర్, నంద్యాల,C. విజయ భాస్కర రెడ్డి, EE, NH (జాతీయ రహదారి)కె. సుబ్బ రాయుడు, DE, R&B, NDL,ఎన్.సురేష్ బాబు, డీఈ, ఆర్ అండ్ బీ, ఆత్మకూర్, J. జగదీష్ గుప్తా, DE, NH, కర్నూలు,S. రవికాంత్, AE, NH, కర్నూలు, వై.వెంకటేశ్వర రెడ్డి, AE, R&B, NDL, రజియా సుల్తానా, DPTO, APSRTC, NDL, J. మాధవి లత, DM, APSRTC, NDL, జి.శివ శంకర్, ఏఈ, పంచాయతీరాజ్ ,కె. నాగరాజు, ఈఈ, పంచాయతీరాజ్ ,జి. సుబ్బయ్య, AMVI, NDL, మొదలగు అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top