నంద్యాల 2, 40 వార్డ్ లలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల జిల్లా / డిసెంబర్ 31 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
నంద్యాల టౌన్ 2, 40 వార్డ్ లలో లబ్ధిదారుకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు . ఈ 2025 సంవత్సరం ఈరోజుతో అయిపోతుందని రేపు నూతన సంవత్సరం 2026 లోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఇంత ఒక పండగ వాతావరణం నెలకొనాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఒక్కరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని ఫరూక్ తెలిపారు. అలాగే 200 రూపాయలు ఉన్న పెన్షన్ వేయి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు కే దక్కిందని అన్నారు … అదేవిధంగా 1000/- రూపాయలు ఉన్న పెన్షన్ 2000/- చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అన్నారు గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని … ఏట 250/-రు పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని … టిడిపి అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 3000/- రు పెన్షన్ ని 4000 పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డిసెంబర్ 31 వ తేదీ నంద్యాల టౌన్ 2 మరియు 40 వార్డ్ లలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో , అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు .
ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, 2 వార్డ్ టీడీపీ నాయకులు మహబూబ్ జెలాని, పుంగ జాకిర్, నబిరసూల్, కలామ్ ,ఖాజా .కొమ్మ శ్రీహరి, కరీం, జహంగీర్ మహబాషా ,ఫరూక్ , క్లస్టర్ ఇంచార్జ్ కామిని మల్లికార్జున, రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, మాజీ కౌన్సిలర్ మిద్దె ఉసేని, అక్బర్ బాషా,4 వార్డు కౌన్సిలర్ తబ్రేజ్, జాకిర్, సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు , ప్రజలలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top