గ్యాస్‌పై అపోహలు వద్దు.. సరఫరా సజావుగా కొనసాగుతోంది – అర్బన్ తాసిల్దార్ శ్రీనివాసులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 04  :

అర్బన్ తాసిల్దార్ శ్రీనివాసులు శనివారం తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై వ్యాపిస్తున్న వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు రావాల్సిన అవసరం లేదని, సిలిండర్లు నేరుగా వారి ఇళ్లకే సరఫరా చేస్తున్నామని వివరించారు. ఏజెన్సీల వద్ద గుంపులు గుమికూడకుండా ఉండాలని సూచించారు.  అలాగే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా గమనించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Scroll to Top