లైఫ్ సర్టిఫికెట్లకు గడువు

నంద్యాల జిల్లా / డిసెంబర్ 31 – 2025 / సత్యం వార్త ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల నుండి జీవన ధ్రువపత్రాలు (లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 01 నుంచి ఫిబ్రవరి 28 వరకు సబ్ ట్రెజరీలు మరియు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో స్వీకరిస్తామని జిల్లా ఖజానా మరియు గణాంకాల అధికారి శ్రీమతి ఎం. లక్ష్మీదేవి గారు తెలిపారు.

పెన్షనర్లు తమ జీవన ధ్రువపత్రాలను ట్రెజరీ కార్యాలయాల్లోనే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్‌లో ఎక్కడి నుంచైనా సమర్పించవచ్చని, అలాగే మొబైల్ ఫోన్‌లో ‘జీవన్ ప్రమాణ్’ యాప్ ద్వారా కూడా జీవన ధ్రువపత్రాలు సమర్పించే సదుపాయం ఉందని ఆమె తెలిపారు..పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనట్లయితే, సమీపంలోని సబ్ ట్రెజరీ లేదా జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతి ట్రెజరీ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 28లోపు జీవన ధ్రువపత్రాల నమోదు పూర్తి చేయని పెన్షనర్లకు మార్చి నెల పెన్షన్ నిలిపివేయబడే అవకాశం ఉన్నందున, ప్రతి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుడు తప్పనిసరిగా నిర్ణీత గడువులోపు తమ జీవన ప్రమాణ్ పత్రాలను నమోదు చేయవలసిందిగా ఆమె కోరారు.

Scroll to Top