సన్‌రైజ్ జూనియర్ కళాశాల ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04  :

నంద్యాల పట్టణం స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర పద్మావతి నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సన్‌రైజ్ జూనియర్ కళాశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ శనివారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేట్ విద్యాసంస్థల పాత్ర కీలకమన్నారు . ఐఐటి- జెఈఈ , నీట్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా ఉత్తమ శిక్షణ అందించాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. అలాగే సన్‌రైజ్ జూనియర్ కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉత్తమ కోచింగ్ ప్రోగ్రామ్‌లను (ఐఐటీ జేఈఈ మైన్స్ /అడ్వాన్స్ , ఎఐఐఎమ్ఎస్ /నీట్ ) అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కళాశాల చైర్మన్ పరుచూరి శ్రీరాములు , డైరెక్టర్లు అనిల్ కుమార్ , శ్రీరాములు , కొండా రమేష్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Scroll to Top