



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04 :
టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ, అశ్లీల అసభ్యకర వ్యవహారాలకు పాల్పడుతున్న బి.ఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు.
శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన పదవిలో ఉండి, బూతురోత కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఇసాక్ బాష విమర్శించారు. పవిత్ర పదవికి కళంకం తెచ్చిన బి.ఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన బి.ఆర్ నాయుడును వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నేతలు తీవ్రంగా ఖండించారు చంద్రబాబు వైఖరిపై ధ్వజంమెత్తారు. బి.ఆర్ నాయుడు అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తూ, కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. “తప్పు చేసిన వారు చైర్మన్ పదవిలో ఊరేగుతుంటే.. నిజాలు మాట్లాడే వారు జైల్లో ఉండటం ప్రజాస్వామ్యమా?” అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.”కామంధుడిని కాపాడుతున్న చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, టీటీడీ చైర్మన్ పదవికే బి.ఆర్ నాయుడు కళంకం తెచ్చారని, వెంటనే ఆయనను తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని.” — వైసీపీ నేతల డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సెక్రెటరీ శశికళ రెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి నంద్యాల వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దల్ మిల్ అమీర్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిషా, రత్నబాబు చౌదరి,వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా వైసిపి అధికార ప్రతినిధి అనిల్ అమృత రాజ్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైసీపీ జిల్లా కార్యదర్శులు దేవ నగర్ బాషా, శివనాగిరెడ్డి, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, మాజీ కౌన్సిలర్స్ దండే బోజ్జయ్య, పడకండ్ల సుబ్రమణ్యం,పున్న శేషయ్య, లక్ష్మీనారాయణ,శాదిక్ బాషా, చింపింగ్, ఆరిఫ్ నాయక్, బాసిద్, చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, కలాం భాష, మునయ్య, నంద్యాల అసెంబ్లీ దూదేకుల సంఘం అధ్యక్షురాలు హుస్సేనమ్మ, వైసిపి నాయకులు దండే సుధాకర్, కిరణ్ కుమార్, గన్ని కరీం, అశోక్ రెడ్డి, నిరవాటి రవి నాగరాజు, శంకర్ నాయక్, మధు గౌడ్ మరియు వైసీపీ నాయకులు ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బి.ఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిని ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరించారు.
