నంద్యాల గడ్డపై వెల్లివిరుస్తున్న విజయ గీతిక – మన రాజధాని, మన అమరావతి





సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 02 :
నంద్యాల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం పార్టీ కార్యాలయం నుంచి పద్మావతి ఆర్చి వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి అనే నినాదాలు పలికారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని కోసం ఎదురుచూస్తూ, పోరాటం చేస్తూ వచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించే ప్రయత్నం చేసి, ఆంధ్రప్రదేశ్‌కు స్థిరమైన రాజధాని లేకుండా చేసిన విషయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంకల్పంతో అమరావతిని తిరిగి ఒకే రాజధానిగా నిలబెట్టడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమరావతి రైతులు, మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చూపిన పట్టుదల, పోరాట స్పూర్తి ఈ విజయానికి ప్రధాన కారణమని మంత్రి ఫరూక్ తెలిపారు. శాంతియుతంగా పోరాడిన రైతుల త్యాగాలకు ఇది దక్కిన న్యాయం అని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పండుగ రోజు అని, ఇకపై రాబోయే తరతరాలకు అమరావతి అభివృద్ధి మరియు సంక్షేమానికి రెండు కళ్లుగా నిలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే బ్రాండ్‌గా అమరావతి రూపుదిద్దుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆనందాన్ని ప్రజలతో కలిసి పండుగలా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మద్దతుతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకుల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
