
నంద్యాల పట్టణంలోని ఇంటి స్థలాల కోసం అర్జీలు పెట్టిన ప్రతి నిరు పేదకు ఇంటి స్థలం వచ్చేంతవరకు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పోరాటం ఆగదని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సిపిఐ జిల్లా నాయకులు మురళీధర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు హరినాథ్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ సిపిఐ పట్టణ నాయకులు ధనుంజయ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ మహిళా సమాఖ్య నాయకులు సరోజమ్మ సలీమా తెలిపారు
అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఇల్లులేని వారిని గుర్తించి వారితో సచివాలయాల దగ్గర ఎమ్మార్వో కార్యాలయం దగ్గర కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు నిర్వహించి వారితో వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాటుతున్న కూడా ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడం లేదు ఎన్నికల ముందు గ్రామాలలో మూడు సెంట్ల ఇంటి స్థలం పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ప్రతి ఒక్కరికి ఇచ్చి పక్కా ఇల్లు నిర్మిస్తామని అధికారం వచ్చినాక కాలయాపన చేస్తూ పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అయినారు
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిల బెట్టుకొని నంద్యాల పట్టణంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించ కపోతే జనవరిలో మేము ఎక్కడైతే పేదల తో అర్జీలు ఇప్పించినమో అక్కడ పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమానికి పిలుపు నిస్తామని అన్నారు.
