వాహనాలు ఇలా ఉంటే వేలం పాట దారుడికి ఇబ్బంది
మున్సిపల్ అధికారులు వెంటనే వాహనాలు లేకుండా చర్యలు చేపట్టండి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 02 :
నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎట్టకేలకు కూరగాయల మార్కెట్, సైకిల్ స్టాండ్ వేలం పాటలు నిర్వహించారు. మూడేళ్లుగా కూరగాయల మార్కెట్ వేళలు జరగకపోవడంతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో కూరగాయల మార్కెట్ కు 51 లక్షల 15 వేలకు, సైకిల్ స్టాండ్ కు లక్షా 31 వేలకు పాటదారులు పడుకున్నారు. ఇక్కడే వేలం పాట పాటధారులకు ఇబ్బందులు తలెత్తాయి.సైకిల్ స్టాండ్ కు సంబంధించిన వేలం పాట డబ్బులు అంతా అధికారులు కట్టించుకున్నారు.ఇక్కడి వరకు బాగుంది,అసలు కథ ఏమంటే కూరగాయల మార్కెట్ లో సైకిల్ స్టాండ్ ప్రాంతంలో భారీగా వాహనాలు ఉండడంతో వేలం పాట దారుడు ఏమి చేయలేని పరిస్థితి.అక్కడ నుంచి తొలగించాలని ఆ వాహన దారులకు చెప్పినా పట్టించుకోకపోవడం విశేషం.పెట్టిన పెట్టుబడి రావాలన్నా,వాహనాలు పార్క్ చేయాలన్నా ఇదొక్కటే మార్గం కావడంతో ఇబ్బంది తలెత్తింది.అధికారులు ఇచ్చిన స్థలంలో వాహనాలు తొలగించాలంటే నష్టపోతామని వేలం పాట దారుడు షేక్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడ ఉన్న వాహనాలు తొలగించి వేలం పాట దారుడు కు న్యాయం చేస్తారని ఆశిద్దాం
