అర్హులైన ప్రతి ఒక్కరికి పించన్లు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం
ఎస్పీవై రెడ్డి కాలనీ అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు – త్వరలో రోడ్డు నిర్మాణం, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 01 :
నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక మంత్రి వర్యులు కుమారుడు రాష్ట్ర యువ నాయకుడు ఎన్.ఎం.డి.ఫయాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్ మాట్లాడుతూ ప్రతినెల ఒకటవ తేదీన నిర్వహించే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు పాల్గొనడం జరిగింది అని ఆయన అన్నారు. మొట్టమొదటిసారిగా 200 రూపాయల పెన్షన్ నుండి 2000 రూపాయల వరకు అలాగే 2000 నుంచి 4000 వరకు పెన్షన్ మంజూరు చేసి అవతాతలకు,వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్న ఒక ఘనత కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కి దక్కుతుందని ఆయన అన్నారు.అనంతరం ఎన్ ఎం డి.ఫయాజ్ ను బుగ్గ రాముడు
కాలనీ రోడ్డు గురించి అడగడం జరిగినది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి రోడ్డు వేపిస్తామని చెప్పారు. ఇందుకుగాను 25 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కాలనీకి త్వరలో మినరల్ వాటర్ ప్లాంట్ పెడతామని చెప్పారు. దీనికిగాను కాలనీ బుగ్గ రాముడు, ఫయాజ్ కాలనీ వాసులు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మరాఠీ సూరి,తాటికొండ మహేష్ బాబు,వడ్డే నాగేంద్ర,హిమామ్ హుస్సేన్,కల్కి రాఘవేంద్ర,కోటీశ్వరుడు, ప్రసాద్ రెడ్డి,సౌభాగ్యవతి, మల్లయ్య,జగన్,ఫిరోజ్, ఉమాకాంతయ్య,తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
