


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 30 :
నంద్యాల నియోజకవర్గ పరిధి రైతు నగరంలోని శిల్పా నగర్ నందు నిర్మించిన గృహాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 2,50,893 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సొంత ఇల్లు పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ కి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, కోమలి హోటల్ మధు, నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, లబ్ధిదారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
