
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 24 :
న్యూ ఢిల్లీలోని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని ఆమె నివాసంలో మంగళవారం ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, రిటైర్డ్ ఐజి లు, ఏడిజి లు,, సిఐఎస్ఎఫ్, డిఐజీ, స్థాయి అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి వారి సమస్యలు, ఫోర్సెస్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతిపాదనలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి తెలియజేయడం జరిగింది. ఈ అంశాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి, అవసరమైన విధాన మార్పుల కోసం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని వారికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చినట్లు చెప్పారు.
