నంద్యాలలో ‘ఒకే వ్యక్తి రాజ్యం’..!!..వైద్య రంగం పేరుతో రాజకీయ దందా..!!

..వైద్య రంగాన్ని కట్టిపడేసిన ఆ వైద్యాధికారిపై సంచలన ఆరోపణలు..!!

..మీడియా నియంత్రణ నుంచి బ్లడ్ బ్యాంక్,స్మశానం దాకా ఆధిపత్యం..!!

..ప్రజలు,వైద్యుల్లో పెరుగుతున్న అసహనం..!!

నంద్యాల:

నంద్యాల పట్టణంలో వైద్య రంగాన్ని ఒకే వ్యక్తి ఆధీనంలోకి తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఒక వైద్యాధికారి తన ప్రభావాన్ని వినియోగిస్తూ మెడికల్ క్యాంపులు,ఆసుపత్రుల ప్రారంభోత్సవాలు,మీడియా వ్యవహారాలు అన్నింటినీ తన కంట్రోల్‌లో ఉంచుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!!

..వైద్య శిబిరం జరిగినా,ఆసుపత్రి ఓపెనింగ్ జరిగినా ఆయనే వైద్యుడు,ఆయనే ఫోటోగ్రాఫర్,ఆయనే విలేఖరి,అంతేకాదు వైద్య సంఘాల నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారని సమాచారం.కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి..!!

..గత సాధారణ ఎన్నికల సమయంలో ఈ వైద్యాధికారి రాజకీయ నాయకులతో నేరుగా సంబంధాలు పెంచుకుని,“నంద్యాలలో వైద్యులందరినీ మీకే సపోర్ట్ చేయిస్తాను..నేను వైద్య సంఘాలకు అధ్యక్షుడిని..జిల్లాలోని అనేక సంఘాలు నా చేతుల్లోనే ఉన్నాయి”అంటూ హామీలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..!!

..ఈ హామీల పేరుతో వివిధ రాజకీయ నాయకుల నుంచి భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేసి,అదే పార్టీకి అనుకూలంగా మారడం ఆయన నైజమని స్థానిక రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి..!!

..ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో వెంటనే ఆ ప్రభుత్వానికి దగ్గరవుతూ తన స్థానం కాపాడుకోవడం ఆయన నైజంగా మారిందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి..!!

..ఇక పాత్రికేయుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరికి సంవత్సరానికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చి తనకు అనుకూలంగా వార్తలు రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక కార్యక్రమాల విషయానికి వస్తే,మీడియాకు సమాచారం ఇవ్వకుండా స్వయంగా వెళ్లి ఫోటోలు తీసి,మధ్యాహ్నం వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు పంపించడం ఆయనకు అలవాటైందని అంటున్నారు..!!

..ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ఘటనలపై వార్తలు రాయకూడదని మీడియాపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఎవరైనా తన మాట వినకుండా వార్త రాస్తే వారిపై“బ్లాక్ మెయిల్” ఆరోపణలు చేస్తూ వైద్యులతో కలిసి ప్రెస్ మీట్లు నిర్వహించడం,గతంలో పాత్రికేయులపై ధర్నాలు చేస్తామని హెచ్చరించడం మరింత వివాదాస్పదంగా మారింది..!!

..ఆ వైద్యాధికారి స్లీపింగ్ పార్టనర్‌గా ఉన్న బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాతల నుంచి అవసరానికి మించి రక్తం సేకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.సేకరించిన రక్తాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి..!!

..ఆసుపత్రుల నుంచి స్మశానాల వరకు ప్రతి అంశంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.నంద్యాల వైద్య వర్గాల్లో ఆయన ప్రభావం అంతగా పెరిగి,“ఆయన చెప్పిందే ఫైనల్”అనే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు..!!

..ఇక తాజాగా,ఈ వైద్యాధికారిపై నంద్యాల జిల్లా ప్రజలు,కొందరు వైద్యులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందని బహిరంగ సమాచారం..!!

..వైద్య రంగం,మీడియా వ్యవహారాలు,బ్లడ్ బ్యాంక్ కార్యకలాపాలపై వస్తున్న ఈ సంచలన ఆరోపణలు నిజమా?? కాదా?? అన్న దానిపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని స్థానిక జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..!!

..నంద్యాల పట్టణంలో దాదాపు 400 మందికి పైగా వైద్యులు ఉన్నప్పటికీ,ఒక ప్రముఖ వైద్యుడి వ్యవహారశైలి పట్ల అసంతృప్తి పెరుగుతోందన్న వార్తలు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆయన ప్రవర్తన నచ్చక అనేక మంది సీనియర్ వైద్యులు అధికారిక,సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం..!!

..సీనియర్ వైద్యులను సంప్రదించగా,“ఆయన గురించి మాట్లాడితే చాట భారతం ఉంటుంది..ఒకసారి బహిర్గతం చేస్తే వైద్య వృత్తికే కళంకం వచ్చే పరిస్థితి” అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం..!!

..వైద్యులకు సంబంధించిన కార్యక్రమాల పేరుతో ఖర్చులు చూపించి,కార్యక్రమం జరిగిన వారం తర్వాత అందరికీ బిల్లులు పంపించడం అలవాటుగా మారిందని ఒక సీనియర్ వైద్యుడు ఆరోపించారు.“ఇచ్చే పరిస్థితి లేకపోయినా ఇవ్వాల్సిందే అన్న ఒత్తిడి ఉంది” అని ఆయన వాపోయారు..!!

..ప్రభుత్వం ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాల కోసం రెండు సార్లు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ,గతంలో టౌన్ హాల్‌ను ఉచితంగా వినియోగించుకుని కార్యక్రమాలు నిర్వహించి,భారీగా నిధులు సేకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఖర్చుల వివరాలు అడిగే ధైర్యం ఎవరికి లేకపోవడంతో లెక్కలు పారదర్శకంగా లేవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..!!

..ఇక సేవా కార్యక్రమాల పేరుతో సేకరించిన నిధుల వినియోగంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా వికలాంగుల పింఛన్ల విషయంలో,“పింఛన్ మంజూరు చేయిస్తే ముందుగా కొంత మొత్తాన్ని ఇవ్వాలనే ఒత్తిడి ఉంటుంద”నే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి..!!

..మరో కీలక అంశం మెడికల్ రంగానికే సంబంధించినది.నంద్యాల పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో బ్రాండెడ్ కంపెనీల మందులు అందుబాటులో లేకుండా,నరసరావుపేట కు చెందిన ఓ హోల్సేల్ వ్యాపారి సరఫరా చేసే అనుమానాస్పద మందులే వినియోగంలో ఉన్నాయని సమాచారం.ఈ మందులు హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని చిన్న స్థాయి తయారీ యూనిట్ల ద్వారా ప్రత్యేక కాంబినేషన్లతో తయారు చేయించుకుని మార్కెట్‌లోకి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..!!

..ఈ వ్యవహారంలో సంబంధిత వైద్యుడి ప్రభావం ఉందని,ఈ సరఫరాలకు అనుమతులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతిఫలంగా ఆ వైద్యునికి విదేశీ పర్యటనలు,ఖరీదైన వాహనాలు,భారీ నగదు అందుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది..!!

..ఈ ఆరోపణలపై త్వరలోనే ఆధారాలతో బహిర్గతం చేస్తామని కొందరు వైద్యులు సంకేతాలు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది..!!

..నిజానిజాలు వెలికితీయడానికి ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలనే డిమాండ్ జిల్లాలో వినిపిస్తోంది..!!

..త్వరలో పూర్తి ఆధారాలతో మీ ముందుకు ..!!

Scroll to Top