
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 21 :
నంద్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, సీనియర్ అడ్వకేట్, మాజీ గవర్నమెంట్ ప్లీడర్ అయిన బొల్లెద్దుల రవి కుమార్ ను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేసిన రవికుమార్, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పై విశ్వాసం ఉంచిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, మా గురువు, పెద్దాయన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డికి, అలాగే వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ వర్గాలు తెలిపిన ప్రకారం, న్యాయవాదిగా మరియు ప్రజా సమస్యలపై సుదీర్ఘ అనుభవం కలిగిన రవికుమార్ నియామకం ద్వారా నంద్యాల జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రచార కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పార్టీ విధానాలు, సంక్షేమ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లడం తన ముఖ్య బాధ్యతలుగా భావిస్తున్నట్లు రవికుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా రంజాన్ పండుగ వేళ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
