నంద్యాల మీదుగా బెంగళూరు – కలకత్తాకు వారంతపు రెగ్యులర్ ట్రైన్ – నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :

ఒక సంవత్సరం నుంచి స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా నడుస్తున్న రైలు నెంబర్ 02683/02684 సంత్రగాచి- ఎల్హంక-సంత్రగాచి కి నడుస్తున్న వారంతపు స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు ట్రైన్ ఆన్ డిమాండ్ గా పరిగణించి దక్షిణ మధ్య రైల్వే శాఖ 02- ఏప్రిల్ 2026 నుండి రెగ్యులర్ వారంతపు ఎక్స్ ప్రెస్ గా రైలు నెంబర్ 18063 ఉంటుందని రైల్వే అధికారులు సూచించారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం తెలిపారు.

ఈ రైలు ప్రతి గురువారం సంత్రగాచి(కలకత్తా)నుండి బయలుదేరి దువ్వాడ, విజయవాడ మీదుగా నంద్యాలకు మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం  3:15 గంటలకు చేరి, ఎల్హంక(బెంగళూరు) వైపు బయలుదేరుతుందని, . 18064 రైలు నెంబర్ ఎల్హంక లో ప్రతి శనివారం ఉదయం 4:50 నిమిషాలకు బయలుదేరి అనంతపురం, డోన్ మీదుగా నంద్యాలకు మధ్యాహ్నం 1:00 గంటలకు చేరుకొని విజయవాడ,  దువ్వాడ మీదుగా సంత్రగాచికి మరుసటి రోజు సాయంత్రం ఆదివారం 5 గంటలకు చేరుకుంటుందన్నారు. .ఈ రైలు మొత్తం ఏ.సీ బోగీలతో నడుస్తుందని,  స్పెషల్ ఎక్స్ ప్రెస్ గా ఉన్నప్పుడు ధర అధికంగా ఉండేది ఇప్పుడు రెగ్యులర్ రైలు కావడంతో 30% ధర తక్కువగా ఉంటుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల మీదుగా కలకత్తా,  బెంగళూరుకు వెళ్లే నంద్యాల పార్లమెంట్ రైలు ప్రయాణికులు, నంద్యాల జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.

https://satyamvaarthatelugudaily.com

Scroll to Top