రథోత్సవానికి  కట్టుదిట్టమైన బందోబస్తు

స్వయంగా డ్రోన్ కెమెరాల  ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 19 :

శ్రీశైలం నందు జరుగుచున్న ఉగాది మహోత్సవాల చివరిరోజు అత్యంత వైభాగంగా రథోత్సవం జరగనున్న సందర్భంగా ఎలాంటి అపశృతులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఏర్పాట్లను స్వయంగా డ్రోన్ కెమరా ద్వారా పరిశీలించడం జరిగింది.  చండీహోమం అనంతరం రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది.

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి  రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి, కార్యక్రమాలు జరిపించబడుతాయి.రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నరాశి) సాత్వికబలిగా సమర్పించబడుతాయి.

ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది రథోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు)  కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గొరవనృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి…

రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారం:  ఉగాది ఉత్సవాలలో చేయబడే శ్రీ అమ్మవారి అలంకారాలలో భాగంగా ఈ రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం, అలంకారమూర్తికి విశేషపూజలు జరిపించబడుతాయి. చతుర్భుజాలను కలిగిన ఈ దేవిపాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇవ్వనున్నారు. ఈ దేవిని దర్శించడం వలన కోరికలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పబడుతోంది.

Scroll to Top