విద్యా రంగంలో డిజిటల్ అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించాలి – డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :
లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నంద్యాల జిల్లాతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సదుపాయాల పెంపు కోసం పార్లమెంట్‌లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విజ్ఞప్తి చేశారు.
నంద్యాల జిల్లాతో పాటు దేశం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన డిజిటల్ విద్య అందించేందుకు వైఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ అత్యంత అవసరమని. ప్రస్తుతం మా పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం 4 పాఠశాలలకే వైఫై సదుపాయం ఉండటం గమనార్హం అని పార్లమెంట్ దృష్టికి ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల సమస్య తీసుకెళ్లారు.
నంద్యాల జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు వైఫై కనెక్టివిటీ విస్తరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లో సంబంధిత మంత్రిని కోరడం జరిగిందన్నారు.
ప్రతి విద్యార్థికి సాంకేతిక విద్య అందుబాటులోకి రావడం మన బాధ్యతఅని, ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్‌గా మార్పు చేసి మరింత బలోపేతం చేయాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభలో కోరారు.

Scroll to Top