దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :

దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో, సమాన అవకాశాలతో జీవించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంద్రధనుస్సు’ కార్యక్రమంలో భాగంగా ‘దివ్యాంగ శక్తి’ (ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం) పథకాన్ని స్థానిక నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఫరూక్ దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వారు స్వేచ్ఛగా తిరిగేలా ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు . ఈ పథకం ద్వారా దివ్యాంగులు విద్య, ఉపాధి, మరియు ఆరోగ్య అవసరాల కోసం ఎక్కడికైనా సులభంగా వెళ్లవచ్చు అని . ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. ఏ ఒక్క పౌరుడు వివక్షకు గురికాకూడదనే లక్ష్యంతో, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ఈ కార్యక్రమమే నిదర్శనం అన్నారు. అనంతరం మంత్రి ఫరూక్  లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. 10వ తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేని మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , రజియా సుల్తానా, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, రమణయ్య స్థానిక క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో దివ్యాంగ లబ్ధిదారులు పాల్గొన్నారు.

Scroll to Top