దేవస్థాన కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షణ


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 17 :భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా స్వామి ,అమ్మవార్లను దర్శించుకునేలా సుమారు 1800 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. భక్తుల భద్రత మరియు ఆలయ భద్రతను దృష్టిలో ఉంచుకొని గుడి లోపలికి ప్రవేశించు మార్గాలలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్ ల సహాయంతో ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్న పోలీసులు.శ్రీశైల క్షేత్ర పరిసరాలను రోడ్డు ఓపెనింగ్ పార్టీల ద్వారా పోలీస్ జాగిలాల ద్వారా అనుమానం ఉన్న ప్రతి ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది.అటవీమార్గం ద్వారా (కైలాష్ మార్గంలో) పాదయాత్రగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్న భక్తులు, ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు.వాహనాలకు మరియు భక్తుల రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలని టోయింగ్ వెహికల్ ద్వారా పార్కింగ్ ప్రదేశాలకు తరలింపు.భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు, భోజన వసతులు, పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు తదితర సౌకర్యాల ఏర్పాటు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగేలా పటిష్ట ఏర్పాట్లు.. సిసి కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల భద్రత మరియు వాహనాల రద్దీ పర్యవేక్షణ..ప్రతిరోజు సుమారు లక్షకు పైగా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు..పోలీస్ వారి మార్గదర్శకాలను (సూచనలను) అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా మీగమ్యస్థానాలు చేరాలని భక్తులకు పోలీస్ వారి విజ్ఞప్తి చేశారు.
