


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫరూక్ తనయుడు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రీయబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) లో గత 4 రోజుల కిందట మంత్రి ఫరూక్ ఇచ్చిన తర్వాత మిగిలిన 24 చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 23 వ సారి 33 లక్షల 57 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రులు నారా లోకేష్ , ఎన్ఎండి ఫరూక్ లతో పాటు ఫిరోజ్ , ఫయాజ్ లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు , వంటలగల భాస్కర్ రెడ్డి, ఎం కృష్ణాపురం బాలిశ్వర్ రెడ్డి , శేఖర్ రెడ్డి, యాలూరు వెంకట్ రెడ్డి, గోస్పాడు విశ్వనాథరెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృపాకర్, సుంకన్న , నెహ్రు నగర్ వేమారెడ్డి , క్లస్టర్ ఇంచార్జ్ కామిని మల్లికార్జున, పల్లె వెంకటసుబ్బయ్య , 19 టీడీపీ ఇంచార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
