రాయచోటిలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

  • ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ & న్యాయశాఖ మంత్రి
    ఎన్ఎండి ఫరూక్,
    కడప జిల్లా సీనియర్ మైనారిటీ నాయకులు అమీర్ బాబు హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపారు.

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 15 :
రాయచోటి పట్టణంలో నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచిందని మంత్రివర్యులు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాల సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
రాయచోటి నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తమకు ఒక భాగ్యంగా భావిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజల మధ్య స్నేహభావం, పరస్పర గౌరవం మరింత బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
ముస్లిం మైనారిటీల కోసం షాది ఖానాల నిర్మాణం, స్మశాన వాటికలకు ప్రహరీ గోడలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
సామరస్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, హిందూ – ముస్లింలు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రులు పిలుపునిచ్చారు.

ఈ ఇఫ్తార్ విందులో హిందూ, ముస్లిం సోదరులు కలిసి పాల్గొనడం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. మత భేదాలు లేకుండా అందరూ సోదర భావంతో కలిసి జీవించడం భారతీయ సంస్కృతికి గొప్ప గుర్తింపని అన్నారు.

రాయచోటి ప్రాంత ప్రజలతో తనకున్న అనుబంధాన్ని న్యాయశాఖ మంత్రివర్యులు నమడ్ ఫారుక్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజల ప్రేమాభిమానాలను పొందిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దివంగత నేత ఎన్ టి రామారావు పాలనలో రాయచోటి అభివృద్ధి దిశగా పలు కీలక కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మత పెద్దలు, యువత, అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Scroll to Top