

*విజయవంతంగా 63వ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి మెగా వైద్య శిబిరం..
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసమే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటి ఆద్వర్యంలో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రజా వైద్యశాలలో నిర్వహించిన 63వ మెగా వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. కోవెలకుంట్ల తాలూకా సంజామల మండలం మంగపల్లె గ్రామంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి దస్తగిరి రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేందుకే పెద్దరెడ్డి తిమ్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినెల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తన తల్లిదండ్రుల నుండి తనకు వచ్చిన 10 ఎకరాల పొలాన్ని పేదల కోసమే కేటాయించినట్లు చెప్పారు. తన పదకరాల పొలంలో పెద్దిరెడ్డి ట్రస్ట్ తరఫున ప్రజా వైద్యశాలను నిర్మించి అక్కడ పేదలకు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జన్మనిచ్చిన ఊరికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. పేద ప్రజలకు డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డినీ సేవలు అభినందనీయమనీ అన్నారు. ఇందులో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్మించి మెగా వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. ప్రతినెల చివరి ఆదివారం రోజున పేదలకు వైద్య శిబిరంతో పాటు ఉచితంగా మందులు అందిస్తూ తనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమేనని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి తమ సొంత ఖర్చులతో ఉచితంగా భోజన వసతిని కల్పిస్తూ మంగపల్లె గ్రామంలోని ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఆయన చేస్తున్న సేవలే మాకు శ్రీరామరక్ష అన్నారు. 56వ మెగా వైద్య శిబిరంలో 1000 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు డైరెక్టర్, షేక్షావలి రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె జబ్బులు, బిపి, షుగరు , మోకాళ్ళ నొప్పులు, కంటివ్యాదులు, ఊపిరితిత్తుల వ్యాధులు, స్త్రీలకు సంబందించిన వ్యాదులు, చెవి, ముక్కు, గొంతుకు సంబందించిన జబ్బులకు, దంతవ్యాదులు, చర్మవ్యాదులకు వైద్యసేవలు చేసి మందులను ఇస్తున్నామని తెలియజేశారు. కోవెలకుంట్ల సంజామల మండలం పరిసర ప్రాంతం ప్రజలందరూ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు.
