శిల్పా సంస్థల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు

మహిళల ఆనందోత్సాహాల మధ్య మహిళా దినోత్సవ వేడుకలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 08 :

శిల్పా మహిళా సహకార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శిల్పా సేవా సమితి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి శిల్పా మహిళా సహకార్ చైర్మన్ నాగినీ రవి సంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళల ప్రతిభను ప్రోత్సహిస్తూ సమాజంలో వారి పాత్ర ఎంతో గొప్పదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా డిజిటల్ టీవీ, వైఎస్సార్ గల్లీ దవాఖాన, శిల్పా మహిళా బ్యాంక్ లో పని చేసే ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. శిల్పా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ వారికి ప్రోత్సాహం అందిస్తున్నారని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Scroll to Top