అతి చౌకగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ తమ కడుపు నింపుతున్న గోళ్ళ రాజేష్ ను సంతోషంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న ప్రజలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 08 :
నంద్యాల వాస్తవ్యులు,ప్రముఖ పారిశ్రామికవేత్త,సామాజికవేత్త నంద్యాల నియోజకవర్గంలో గడిచిన నాలుగు నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు అందిస్తూ వస్తున్నారు.
ఒక రూపాయికి వాటర్ పాయింట్, చిన్నపిల్లల చాక్లేట్లు కూడా రాని ఈరోజుల్లో ఎవరు ఆకలితో ఉండకూడదని మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో అతి చౌకగా కడుపు నింపుకునే విధంగా వెసులుబాటును కల్పిస్తూ కేవలం ఒక్క రూపాయికే రెండు పుల్కాలు కర్రీ పప్పు, ఒక వెజిటేబుల్ బిర్యాని కర్రీ, 1 రూపాయికే జొన్న రొట్టె,పప్పు మంచి నాణ్యతతో రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
ప్రజలు కూడా కేవలం ఒక రూపాయికే ఆహారాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఒక రూపాయికి రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ తమ కడుపు నింపుతున్న గోళ్ళ రాజేష్ కి కృతజ్ఞతలు,ధన్యవాదాలు తమ ఆశీస్సులు అందిస్తున్నందుకు నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు గోళ్ళ రాజేష్ ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేసేందుకు ఎన్నో రకాలుగా ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయనడానికి ఎంతోసంతోషం వ్యక్తం చేస్తున్నాము.
