విద్యార్థుల నైపుణ్యానికి పదును పెట్టిన సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్

సత్యం వార్త / నంద్యాల / మార్చి 05 :

నంద్యాల పట్టణం సెయింట్ జాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థినీ విద్యార్థులు సైన్స్ ఫెయిర్ దినోత్సవ సందర్భంగా సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నిర్వహించే సైన్స్ ఫెయిర్ (వైజ్ఞానిక ప్రదర్శన) విద్యార్థులలో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం మరియు పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించే అద్భుతమైన వేదిక. ఇది ప్రాజెక్టులు, నమూనాలు మరియు ప్రయోగాల ద్వారా సైన్స్ అంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవడానికి, సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మరియు వాటిని ప్రదర్శించడానికి తోడ్పడుతుంది ప్రతి విద్యార్థి మేధాస్తుకు పదును పెట్టారు. విద్యార్థిని విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త పరికరాలకు రూపకల్పన చేస్తూ వాటి విధివిధానాలను సైన్స్ ఫెయిర్ నందు ప్రదర్శించారు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు విద్యలోనే కాదు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నారని స్కూల్ డైరెక్టర్ టైటస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మిస్సెస్ మెర్సి మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top