పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 72 ఫిర్యాదులు – జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 02 :

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం 2 వ తేదీన నిర్వహించిన  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)  కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఫిర్యాదిదారుల నుంచి 72 ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులలో కొన్ని:

1).3.52 సెంట్ల వ్యవసాయ భూమిని నాకు అమ్ముతానని ఆవుల రమేష్ నాయుడు 15 లక్షలు మరియు హనుమంతు 26 లక్షలు అను వ్యక్తులు డబ్బులు తీసుకుని సదరు పొలాన్ని నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి నాకు అన్యాయం చేశారు కావున వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నాకు న్యాయం  చేయండని పాణ్యం మండలానికి చెందిన వెంకటసుబ్బయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

2).నా పిల్లలకు స్కూల్ లో యోగా టీచర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని శివ శేఖర్ అనే వ్యక్తి నన్ను నమ్మించి నా వద్ద నుండి 5,30,000/-రూపాయలు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే నా పైనే దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నాడు నాకు న్యాయం చేయండని ముష్టపల్లె గ్రామానికి చెందిన ఆదినారాయణ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

3)నేను వెల్డింగ్ షాపు నడుపుకుంటూ జీవనం చేయుచున్నాము. నా షాపు ముందర షేక్ మొహమ్మద్ రఫీ మట్టి తోలి రాస్తా మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కావున నాయందు దయవుంచి అతనిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండని సలీంనగర్ కు చెందిన షేక్ .షేర్ అలీ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Scroll to Top