బాల అకాడమీ పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు

సత్యం వార్త / నంద్యాల / మార్చి 02 :

నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో 02 వ తేదీన అనగా సోమవారం రోజున ఘనంగా హోలీ సంబరాలను జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి.రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవవీలత మాట్లాడుతూ హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగ దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి ఈ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని “హోలీకా పూర్ణిమ” గా కూడా వ్యవహరిస్తారు రాక్షస రాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. దీనితో అతని సోదరి హోలీకను పిలుస్తాడు. ఆమె ప్రహ్లాదుడిని మంటల్లోకి పడవేస్తే ఆ మంటల్లో ప్రహ్లాదుడు విష్ణు మాయతో ప్రాణాలతో బయటపడి ,హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో పడి చనిపోతుంది. హోలీక దహనమైన రోజుని హోలీగా జరుపుకుంటాము అని పండుగ యొక్క విశిష్టతను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు పసుపు,కుంకుమ,గంధం లను పూసుకొని రంగు నీరు చల్లుకొని ఆనందోత్సాహంలో తేలియాడారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top