వైభవంగా శ్రీరుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయ 33వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 27:
నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయ 33వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు ఈనెల 23వ తేది నుండి 27వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజు ఏకాదశీలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, కలశపూజలు, అర్చనలు, హోమాలు, గ్రామరక్ష పూజలు, గ్రామనాభిపూజలు, కుష్మాండ ప్రధానములు, శాంతి హోమాలు నిర్వహించారు. ఉదయం 10.45 గంటల నుండి పూర్ణాహుతి, కలశాధ్వాసనములు, మార్జనలు, కంకణా విసర్జనలు, తీర్థప్రసాద వినియోగములు ఆశీర్వాచనలు, ఫలప్రదాన కార్యక్రమాలు జరిపారు. 12గంటల కు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమమలు, సాయంత్రం తర్వాత గరుడసేవా, గ్రామోత్సవం వైభంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవ వేడుకలలో గ్రామస్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు.

Scroll to Top