కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వెంటనే అమలు చేయాలి

నూతన కౌలుచట్టం ఏర్పాటు చేయాలి.

36 గంటల నిరసనదీక్ష ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు, రైతు సంఘాల నాయకులు.

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 23:
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 36 గంటల నిరసన దీక్షను కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి రమేష్ కుమార్ ప్రారంభించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడుఏ. రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షల కు ముఖ్యఅతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి  కౌలు రైతు సంఘం ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామచంద్రుడు గార్లు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రోజురోజుకు కౌలు రైతుల సంఖ్య పెరిగిపోతుందని, సొంత భూమి గల రైతులతో సమానంగా పంటలు ఉత్పత్తి చేస్తున్న కౌలు రైతులకు అవసరమైన కౌలు గుర్తింపు కార్డులు,పంట రుణాలు, పంటనష్టపరిహారాలు, సబ్సిడీ విత్తనాలు ఎరువులు మరియు మద్దతు ధరలు వర్తింప చేయకపోవడం, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా పెట్టుబడి సహాయం ఇరవై వేల రూపాయలు 20 నెలలు గడిచిన ఇవ్వకపోవడం వల్ల కౌలు రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద పెట్టుబడులబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల బాధలు అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అన్నారు. ఎన్నికల సమయాల్లో అనేక రకాల హామీలు ఇచ్చే ప్రభుత్వాలు గతంలో జగన్ ప్రవేశపెట్టిన కౌలు చట్టం బాగోలేదని సమగ్రమైన కౌలు చట్టం తీసుకువస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 20 నెలలు గడిచినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క కౌలు రైతుకు పెట్టుబడి సహాయం 20,000 ఇవ్వకపోవడం, సమగ్రమైన కౌలు చట్టం తీసుకు రాకపోవడం అన్యాయమన్నారు. అందువల్లనే మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాలు కౌలు రైతు సంఘాలు నేటి నుండి 36 గంటల పాటు నిరసన దీక్షలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని, జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లోనైనా చర్చించి కౌలు రైతులను కాపాడే విధంగా నూతన కౌలు చట్టం తీసుకురావాలని, ఒకే దఫాలో పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల రూపాయలు వెంటనే కౌలు రైతుల అకౌంట్లో జమ చేయాలని, సొంత రైతు సంతకంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇచ్చి బ్యాంకుల ద్వారా అవసరమైన పంట రుణాలు ఇవ్వాలని, ఈ క్రాప్ నమోదులో కౌలు రైతుల పేర్లు నమోదు చేసి, వాటి ఆధారంగా సబ్సిడీ విత్తనాలు ఎరువులు మరియు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని, కులాలతో సంబంధం లేకుండా ఓసి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ,, ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా కౌలు రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు ఇవ్వాలని, పంట నష్టపోయి తీవ్రంగా అప్పులపాలై ఇబ్బంది పడుతున్న రైతులు కౌలు రైతుల పై ఉన్న అన్ని రకాల అప్పులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మార్క్, అధ్యక్షుడు నరసింహుడు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి సుబ్బారాయుడు మాట్లాడారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వెన్న బాల వెంకట్, రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాయక్ మద్దతు తెలిపారు. నిరసన దీక్షలో కౌలు రైతు సంఘం నాయకులు ఏలియా, గడ్డం కుమారి మరియు ఆంధ్రప్రదేశ్ రైతు,కౌలు సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్, వీరన్న,స్వాములు, శ్రీనివాసులు,మద్దిలేటి స్వామి రైతులు కూలీలు చెన్నయ్య, కరీముల్లా, అంబయ్య, గడ్డం పుల్లమ్మ ,సీమోను, సంజీరాయుడు, వెంకటసుబ్బయ్య, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top