
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 23:
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మార్కెట్ ప్రసాద్ ను దేవస్థానం ఘనంగా సత్కరించింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను సమకూర్చి భక్తులకు సేవలందించడంలో మార్కెట్ ప్రసాద్ విశేష పాత్ర పోషించారు. వేలాది మంది భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంలో ఆయన చేసిన సేవలను దేవస్థానం అధికారులు అభినందించారు.
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి రెడ్డి స్వామి వారి శేష వస్త్రంతో పాటు మెమోంటో అందజేసి మార్కెట్ ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. సేవా భావంతో ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి చేయూతనిచ్చినందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, అన్నదానం సూపరెండెంట్ టి లావణ్య, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులకు సౌకర్యవంతంగా, విజయవంతంగా నిర్వహించబడిందని దేవస్థానం అధికారులు తెలిపారు. సేవా కార్యక్రమాలకు మార్కెట్ ప్రసాద్ వంటి దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
