నంద్యాల జిల్లా వడ్డెర గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన: చైర్మన్ మల్లె ఈశ్వరరావు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 21:
ఆంధ్రప్రదేశ్ వడ్డెర అభివృద్ధి మరియు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లె ఈశ్వరరావు కి నంద్యాల వడ్డె రాజుల సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. శనివారం నంద్యాల టౌన్ 19వ వార్డు పొన్నాపురం కాలనీ బైపాస్ రోడ్డు వద్ద గల శ్రీ ఓంకారేశ్వర కోదండ రామాలయంలో వడ్డె రాజుల సంఘం ఆధ్వర్యంలో “నంద్యాల జిల్లా వడ్డెర గ్రీవెన్స్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ మల్లె ఈశ్వరరావు ని సంఘం నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మల్లె ఈశ్వరరావు మాట్లాడుతూ వడ్డె ఓబన్న సొంత జిల్లా అయిన నంద్యాల నుండే వడ్డెరుల సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించి, ఈ గ్రీవెన్స్ ప్రోగ్రామ్‌ను ఇక్కడ మొదలుపెట్టామన్నారు. వడ్డెర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి వీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. నంద్యాల పట్టణంలో వీర వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నా వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. వడ్డె రాజులు నిర్మించిన శ్రీ ఓంకారేశ్వర కోదండ రామాలయ అభివృద్ధికి హామీ ఇస్తున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వడ్డె రాజుల సంఘం ప్రతినిధులు వడ్డే చంద్రగిరి వెంకటసుబ్బయ్య, మంజుల సుబ్బరాయుడు, వడ్డే జనార్ధన్, వడ్డే శీను, కర్నూలు జిల్లా వడ్డే సంఘం అధ్యక్షుడు జరపటి తిరుపాలు బాబు, జీవీఎల్ నారాయణ, సంపంగి రామకృష్ణ, బివిఎన్ రాజు, వడ్డే ఓబన్న వారసుడు మంజుల బాల నరసింహుడు, సురేషు, ఆలకుంట్ల నాగేంద్ర శేషగిరిరావు, వడ్డే నాగేశ్వరరావు, పాణ్యం వెంకటస్వామి, వడ్డే గోపాల్ మరియు పెద్ద సంఖ్యలో వడ్డెర కుల బంధువులు పాల్గొన్నారు.

Scroll to Top