


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 21 :
ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామాల్లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చంద్రశేఖర్ ఆజాద్ “రీజనల్ జాయింట్ కమిషనర్, దేవదాయ శాఖ” వారు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల నారాయణ శర్మ, సురేష్ శర్మ సిబ్బంది ఆలయ మర్యాదలైన పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ స్వామివారికి అభిషేకములు, అర్చనలు పలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపము నందు స్వామివారి కంకణ ధారణ, శాలువాలు, శేష వస్త్రములు, పూలమాలతో ఘనంగా సత్కరించి, ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
